THE HAPPENINGS

THE LIFESTYLE

Latest Stories

పవన్ కల్యాణ్ ఫాన్స్ కి నిజంగా ఇది బ్యాడ్ న్యూస్ ?



వైవిధ్య భరితమైన చిత్రాలకు చిరునామా వెంకటేష్. తన అభిమానులచేత విక్టరీ వెంకటేష్ అంటూ అభిమానంగా పిలిపించు కోవడమే కాకుండా ఎన్నో విజయాలను తన మూడు దశాబ్దాల సినిమా కెరియర్ లో సొంతం చేసుకున్న వెంకటేష్ పుట్టినరోజు నేడు. వెంకటేష్ మంచి నటుడు మాత్రమే కాదు ఆయనలో ఒక మంచి ఆద్యాత్మిక వేత్త కూడా దాగి ఉన్నాడు.  పైకి కనిపించేది అంతా నిజం కాదు నువ్వు ఏమిటి అన్నది నీలోనే దాగి ఉంది అనే భావాలకు ప్రభావితమైన వెంకటేష్ ఆ భావాలకు అనుగుణంగా ఉండే ‘గోపాల గోపాల’ సినిమాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్నాడు. రోజురోజుకు పెరిగిపోతున్న అంచనాల మధ్య ఈ సినిమాలోని వెంకటేష్ లుక్ కు సంబంధించిన స్టిల్స్ విడుదల చేసారు.

 అయితే ఆ స్టిల్స్ లో ఎక్కడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకపోవడం పవన్ అభిమానులను నిరాశపరిచింది అనే వార్తలు వస్తున్నాయి. వెంకీ పుట్టినరోజునాడు వెంకటేష్ తో పాటు పవన్ ను కూడా కలిపి చూద్దాం అనుకున్న పవన్ వీరాభిమానులకు కేవలం ఈ సినిమాకు సంబంధించి వెంకటేష్ స్టిల్స్ మాత్రమే బయటకు రావడం తీవ్ర అసంతృప్తికి లోనుచేసింది అని అంటున్నారు. అయితే ఈ సినిమా యూనిట్ వారు మరొక విధంగా వివరణ ఇస్తున్నారు ఈరోజు వెంకటేష్ పుట్టినరోజు కాబట్టి వెంకీకి సంబంధించిన స్టిల్స్ మాత్రమే బయటకు వదిలాము అనేది వీరి వాదన. ఏది ఏమైనా వెంకటేష్ పుట్టినరోజు పవన్ వీరాభిమనులను తీవ్ర నిరాశ పరిచింది..